ETV Bharat / state

TSRTC CHAIRMAN: ​ఆర్టీసీ ఛైర్మన్​గా నేడే బాధ్యతల స్వీకరణ

టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్ (Tsrtc chairman)గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్(mla bajireddy govardhan)​ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9.15 గంటలకు బస్​భవన్​లో కార్యక్రమం జరగనుంది.

TSRTC CHAIRMAN: టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్​గా నేడు ఎమ్మెల్యే బాజిరెడ్డి బాధ్యతల స్వీకరణ

author img

By

Published : Sep 20, 2021, 6:52 AM IST

నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్‌(mla bajireddy govardhan) నేడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Tsrtc chairman) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు(RTC Cross Road) వద్ద గల బస్‌భవన్‌(TSRTC Bus Bhavan)లో ఉదయం 9.15కి జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రాష్ట్ర ఆవిర్భావం(formation of telangana state) తర్వాత తెలంగాణ ఆర్టీసీకి ఆయన రెండో ఛైర్మన్‌.

గతంలోనే ఉత్తర్వులు..

బాజిరెడ్డిని ఆర్టీసీ ఛైర్మన్​గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్(CM Kcr) గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే(nizamabad (rural) assembly constituency)గా ఉన్నారు. కేబినెట్ విస్తరణ సమయంలో బాజిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల ఆయనకు అమాత్య పదవి దక్కలేదు. అయితే.. ఆయనకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తానని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని సమాచారం.

ఇందులో భాగంగా రైతు సమన్వయ సమితి ఛైర్మన్​గా ముందుగా బాజిరెడ్డి గోవర్దన్​ను నియమిస్తారని చర్చ జరిగినా.. చివరకు ఆ పదవి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డికి దక్కింది. రెండో సారి కూడా భంగపడ్డ గోవర్దన్​కు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పదవే కట్టబెట్టారు. టీఎస్​ ఆర్టీసీకి ఛైర్మన్​గా నియమిస్తూ బాధ్యతలు అప్పజెప్పారు.

సంబంధిత కథనం..

TSRTC chairman : ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.