నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరు, భీమ్‌గల్ మండలాల్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కప్పలవాగుపై రూ. 14 కోట్ల 76 లక్షలతో నిర్మించనున్న 3 చెక్‌డ్యాంలకు శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాల్కొండ నియోజకవర్గానికి ఎక్కువ చెక్‌డ్యాంలు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు. భీమ్‌గల్, వేల్పూరు మండలాల్లోని పలు గ్రామాలు కరువుతో ఉన్నాయని.. వాటిని సస్యశ్యామలం చేసేందుకే ఈ చెక్‌డ్యాంల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం నియోజకవర్గానికి 19 చెక్‌డ్యాంలు మంజూరయ్యాయని.. మరో 4 త్వరలోనే మంజూరవుతాయన్నారు. వీటి ద్వారా 33 గ్రామాల్లోని సుమారు 45 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.