నిజామాబాద్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనిపై వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. కొవిడ్ ఉద్ధృతిపై నిజామాబాద్ కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాకేంద్రం, సరిహద్దు ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని... ఈ నేపథ్యంలో అందరూ మాస్క్లు ధరించాలని సూచించారు. మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యానికి అవసరమైన మందులు, వసతులు సమకూర్చుకోవాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా కేసుల గుర్తింపునకు కొత్త యూప్