ETV Bharat / state

'భాజపా నేతలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలి' - భాజపా నేతలపై మంత్రి వేముల ఆరోపణలు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

'భాజపా నేతలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలి'

author img

By

Published : Jan 29, 2021, 5:00 PM IST

నిజామాబాద్​ జిల్లా బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పర్యటించారు. గ్రామంలో రూ. 9 కోట్లతో చేపడుతున్న పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పేదలకు అందజేస్తున్న పింఛన్​ సొమ్ములో కేంద్రం వాటా రూ.1,800 ఉందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. లేకపోతే ఎంపీ అర్వింద్​ రాజీనామా చేస్తారా...? అని సవాల్​ విసిరారు.

రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాల్లో కేంద్రం వాటా కేవలం రూ.72 వేలు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందని అన్నారు. భాజపా నేతలు సీఎం కేసీఆర్​ను ఏకవచనంతో సంభోదించడం మానుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్​ గొప్ప పాలనాదక్షుడు: కొప్పుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.