ETV Bharat / state

కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపట్టాలి: ప్రశాంత్​ రెడ్డి - తెలంగాణ వార్తలు

కరోనాను ఎదుర్కొనేందుకు నాలుగు విధాల కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన నిజామాబాద్​ జిల్లా యంత్రాంగంతో శనివారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.

prashanth reddy
ప్రశాంత్​ రెడ్డి
author img

By

Published : Apr 18, 2021, 4:35 PM IST

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్​ జిల్లా యంత్రాంగంతో శనివారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. కరోనాను ఎదుర్కొనేందుకు నాలుగు విధాల కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడికి ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు... టీకా పంపిణీలో వేగం పెంచటం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని, పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న పడకలు పెంచాలని ఆదేశించినట్లు తెలిపారు. నిజామాబాద్‌ నగరంలో 11, బోధన్‌లో ఏడు, ఆర్మూర్‌లో ఒకటి చొప్పున జిల్లాలో 19 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు అనుమతించామని చెప్పారు.

ఆక్సిజన్‌ అవసరమైన రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా కొరత కొనసాగుతోందని... నిజామాబాద్‌లోనూ ఆక్సిజన్‌ వినియోగం పెరిగిందన్నారు. జిల్లాలో కరోనా పరీక్షల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోజులో 2500గా నిర్దేశించుకుంటే.. 5 వేలకు పైగా చేస్తున్నామన్నారు. కరోనా బారినపడిన గర్భిణులకు ప్రస్తుతం నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేస్తున్నారని చెప్పారు. మహారాష్ట్రలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఇప్పటికే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి: జీహెచ్​ఎంసీలో రానున్న 4 రోజులు శానిటైజేషన్: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.