ETV Bharat / state

'లాక్​డౌన్​, ఫీవర్​ సర్వే ద్వారా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి'

రాష్ట్రంలో కరోనా లాక్​డౌన్ సత్ఫలితాలనిస్తోందని మంత్రి ప్రశాంత్​ రెడ్డి పేర్కొన్నారు. ఫీవర్​ సర్వే ద్వారా కొవిడ్​ కేసులను కట్టడి చేయగలుగుతున్నామని చెప్పారు. ఈ మేరకు నిజామాబాద్​ కలెక్టరేట్​లో వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

minister prashanth reddy review on corona cases
కరోనా కేసులపై మంత్రి ప్రశాంత్​ రెడ్డి సమీక్ష
author img

By

Published : May 20, 2021, 8:35 PM IST

లాక్​డౌన్, ఇతర కారణాలతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్​లో కరోనా కట్టడి, లాక్ డౌన్, ఆస్పత్రుల్లో వైద్య సేవలపై వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి ప్రశాంత్​రెడ్డి సమీక్ష నిర్వహించారు.

లాక్​డౌన్ సత్ఫలితాలిస్తోందని 10 రోజుల్లో 10శాతం పాజిటివ్ కేసులు తగ్గాయని మంత్రి చెప్పారు. లాక్​డౌన్​కు ముందు నిర్వహించిన ఫీవర్​ సర్వే వల్ల లక్షణాలున్న వారికి మందులివ్వడంతో కట్టడి చేయగలుగుతున్నామని చెప్పారు. మరో 10 రోజుల్లో పాజిటివ్​ రహిత జిల్లాగా నిజామాబాద్​ను మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయిందని.. ఆక్సిజన్, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. బ్లాక్ ఫంగస్ కోసం మందులు తెప్పిస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి: స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం.. పొగాకు వ్యతిరేక ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.