పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిజామాబాద్‌లోని ఖిల్లా ఈద్గా మైదానంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఈనెల 27న భారీ బహిరంగా సభ నిర్వహించనున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే ప్రతీ ముస్లిం ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ రహమత్ అన్సారీ పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్యం లభించిన 70 ఏళ్ల తర్వాత భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితిని ఎన్ఆర్సీ కల్పిస్తోందని రహమత్ అన్నారు. భారతావని మనదని, మనమంతా భారతీయులమనే సందేశం మోదీకి చేరేలా నిరసనలు చేపట్టాలని సూచించారు.