ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలోని లేబర్ అడ్డా వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శానిటైజర్, మాస్కులు పంపిణీ చేశారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంటే ఓ వైపు ప్రధాని మోదీ, మరోవైపు సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆరోపించారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత్లో మునుపెన్నడూ లేని విధంగా హెల్త్ ఎమర్జెన్సీ ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ పాలనా వైఫల్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
కరోనా విపత్కర సమయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పేదల పక్షాన నిలబడాలని మోహన్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కేశ వేణు, అర్బన్ ఇన్ఛార్జి తాహెర్బిన్ హందాన్, జిల్లా ఎన్ఎస్యూఐ అద్యక్షులు వేణు రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరాలో రైల్వే కీలక పాత్ర