ఆంగ్లేయుల పాలన నుంచి మన దేశ విముక్తి కోసం కృషి చేసిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. 151వ గాంధీ జయంతి వేడుకలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద ఆయన నిర్వహించారు. మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
గాంధీ ఆశయాలను గాలికి వదిలేసి గాడ్సే పాలనను దేశంలో ప్రస్తుతం భాజపా కొనసాగిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, తహెర్ బిన్ తదితరులు పాల్గొన్నారు.