నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 36 మంది కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ ఓటు వేశారు.
స్క్రీనింగ్ పరీక్షల అనంతరం...
ప్రజాప్రతినిధులను పోలింగ్ కేంద్రానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీసుకువచ్చారు. స్క్రీనింగ్ పరీక్షల అనంతరం ఎన్నికల సిబ్బంది ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు వేసిన మంత్రి వేముల