నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ రోజు కొంతమంది కార్మికులు, నాయకులు ఆచన్‌పల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. మహిళా కండక్టర్లు బోధన్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సు ముందు బైఠాయించి, తమ నిరసనను తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: డెడ్‌లైన్‌లోపు విధుల్లో చేరిన 487 మంది ఆర్టీసీ కార్మికులు