నిజామాబాద్లో తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున పలు డివిజన్లలో ప్రచారం చేశారు. డబ్బులు పంచి గెలిచిన నాయకులు.. ఆ డబ్బులు తిరిగి సంపాదించడం కోసం తప్ప... ప్రజల కోసం పని చేయరని చెప్పారు.
నాయకులైతే చాలు ఆస్తులు అమాంతం పెరిగిపోతున్నాయని ఆరోపించారు. సంపాదన కాకుండా ప్రజా సంక్షేమం కోసం పని చేసే నాయకులు కావాలని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా తెలంగాణ జనసమితి ముందుకొచ్చందని.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: వికారాబాద్లో మైనర్బాలికపై అత్యాచారం