ETV Bharat / state

ఓటమి చవిచూసిన చోటు నుంచే కవిత గెలుపు

author img

By

Published : Oct 12, 2020, 1:11 PM IST

సీఎం కేసీఆర్​ కుమార్తె.. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.. పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. గతంలో నిజామాబాద్‌ ఎంపీగా కవిత దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. వాక్ఫటిమకు తోడు ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసిన కవిత బతుకమ్మ వేడుకలకు అంతర్జాతీయ ప్రాధాన్యం లభించేలా కృషి చేశారు. ప్రస్తుతం నిజామాబాద్‌ నుంచే ఎమ్మెల్సీగా విజయం సాధించిన కవిత.. మండలిలో తన గొంతుకను వినిపించనున్నారు.

ఓటమి చవిచూసిన చోటు నుంచే కవిత గెలుపు
ఓటమి చవిచూసిన చోటు నుంచే కవిత గెలుపు

కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కుమార్తెగానే కాకుండా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అనేక సమస్యలపై గళమెత్తారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు అంశాలు సహా రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను కవిత ప్రస్తావించేవారు. మహిళలకు సంబంధించిన అంశాలు.. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించేవారు. నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లోనూ కవిత తనదైన ముద్ర వేశారు. తెరాస శ్రేణులను ఏకతాటిపై నడిపించేవారు.

2019లో నిజామాబాద్‌ స్థానం నుంచే ఎంపీగా పోటీ చేసిన కవిత అనూహ్యంగా ఓటమి చవిచూశారు. పసుపు బోర్డు ఏర్పాటు సహా వివిధ అంశాలు ఆమె పరాజయానికి కారణాలయ్యాయని తెరాస విశ్లేషించుకుంది.

ఓడిన చోటే గెలుపు

నిజామాబాద్‌ స్థానం నుంచే మళ్లీ ప్రజాప్రతినిధిగా కవిత ఎన్నిక కావడం విశేషం. ఎంపీగా కవిత ఓటమి తర్వాత ఆమెను రాజ్యసభకు పంపిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి ఉపఎన్నిక రావడం వల్ల కవితను తెరాస పోటీలో నిలిపింది. ఓటమి చవిచూసిన చోటు నుంచే నేరుగా పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో నిలిచినా.. కవిత ఎన్నిక లాంఛనంగా మారింది. నిజామాబాద్‌ జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులు తెరాసవైపే ఉన్నారు. కవిత గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచే స్థానిక నేతలతో మంత్రాంగం నెరిపారు. కవిత విజయానికి నల్లేరుపై నడకలా బాటలు పరిచారు.

ఇప్పటి వరకు దేశ రాజకీయాల్లో చట్ట సభలో గళం వినిపించిన కవిత.. ఇప్పుడు పెద్దల సభలో అడుగుపెడుతున్నారు. ఎంపీగా పలు సందర్భాల్లో కేంద్రాన్ని నిలదీసిన కవిత.. ఎమ్మెల్సీగా కవిత కొత్త పాత్ర పోషించనున్నారు.

ఇదీ చదవండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.