ఇదీ చూడండి: 'కాళేశ్వరం పూర్తైతే ఏడాదంతా గ్రామాలకు జలకళ'
'ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి'
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి కవిత... కాంగ్రెస్, భాజపాలపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని... అయినా తెరాసను ఓడించలేవని ప్రకటించారు.
'ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి'
భాజపా, కాంగ్రెస్ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని బోధన్ ప్రచార సభలో మండిపడ్డారు నిజామాబాద్ తెరాస అభ్యర్థి కవిత. ఆ రెండు పార్టీలు కలిసి ప్రచారాలు చేస్తున్నాయని.. అయినా తెరాసను ఓడించలేవని పేర్కొన్నారు. ఎవరైనా ఎన్నికల్లో పైసలు పంచితే... కచ్చితంగా అది మన సొమ్మే... తీసుకోండి.. ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కవిత ఓటర్లను కోరారు. భాజపా అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. భారతీయ ఝూఠా పార్టీ అని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: 'కాళేశ్వరం పూర్తైతే ఏడాదంతా గ్రామాలకు జలకళ'
Last Updated : Apr 2, 2019, 4:17 PM IST