రైతుల ఉద్యమంపై ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంలో పోలీసులు దమనకాండ సాగిస్తున్నారని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర బాధ్యులు కన్నెగంటి రవి అన్నారు. దిల్లీ సరిహద్దులో అన్నదాతలపై దౌర్జన్యాన్ని నిరసిస్తూ.. మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా నిరసన దీక్షలు చేయాలన్న ఏఐకేఎస్సీసీ పిలుపు మేరకు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని కన్నెగంటి రవి ఆరోపించారు. ఇప్పటికే ఉద్యమం అన్ని రాష్ట్రాలకు వేగంగా పాకిందన్న ఆయన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వానికి మరో మార్గం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి. ప్రభాకర్, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు పీ. వెంకటేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగ సంఘాలతో ముగిసిన అధికారుల చర్చలు