ETV Bharat / state

పోలీసులు ఫోన్ చేశారని భయపడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - కేసు అయితుందేమో అనే భయంతో విద్యార్థిని సూసైడ్

నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పక్కింటి వాళ్లతో గొడవపడిన ఇంటర్ విద్యార్థిని పోలీస్ కేసు అవుతుందనే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

inter student committed suicide beacuse fear of filing a case on her
కేసు అయితుందేమో అని భయపడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Mar 21, 2023, 2:58 PM IST

నిజామాబాద్ జిల్లా సాలురలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న గొడవ.. దానిపై పోలీసుల తీరు బాగాలేక భయంతో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైష్ణవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తోంది. నిన్న ఇంటి పక్కన వారితో జరిగిన చిన్నగొడవతో మనస్తాపానికి గురైన వైష్ణవి రాత్రి సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది.

సాలురు గ్రామానికి చెందిన టింకల్ రమేశ్ కుమార్తె వైష్ణవి(19). ఈమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం పక్కింటి శోభ అనే మహిళతో గొడవ జరిగింది. శోభ ఈ గొడవ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో వైష్ణవి కుటుంబ సభ్యులకు పోలీసులు ఫోన్ చేసి ఈరోజు రావాలని చెప్పారు. పోలీస్ స్టేషన్​కి వెళ్లాల్సి వస్తుందని, పరీక్షలు రాయనివ్వరేమోనన్న మనస్తాపం చెంది వేకువజామున ఫ్యాన్​కి ఉరి వేసుకుని మృతి చెందింది వైష్ణవి.

మా అక్క ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయి. మా ఇంటి పక్క వారితో గొడవ అయ్యింది. పోలీసుల నుంచి ఫోన్ వస్తే భయపడి ఉరేసుకుంది-మృతురాలి తమ్ముడు మనోజ్

పక్కింటోళ్లతో గొడవ అయ్యింది. వాళ్లు కేసు పెట్టామన్నారు. రేపు పోలీసు స్టేషనుకి వెళ్లాలంటే భయపడింది. దాంతో సూసైడ్ చేసుకుంది_మృతురాలి తల్లి లక్ష్మీ

పక్కింటి వాళ్లతో గొడవ అయ్యింది. వాళ్లు కేసు పెట్టారు. పక్కింటోళ్లు భయపెట్టారు. పోలీస్ కేసు పెట్టగానే పోలీసు అమ్మాయికే ఫోన్ చేశాడు. ఆమె భయపడిపోయింది. పరీక్షలు రాయనివ్వరేమో అని భయపడిపోయింది. మనస్థాపం చెంది ఆ అమ్మాయి ఉరేసుకుంది-మృతురాలి బంధువు

వైష్ణవి మృతితో తల్లిదండ్రులు బంధువులు బోరున విలపిస్తున్నారు.. పోలీసులు ఫోన్ రావడంతో మృతురాలు భయబ్రాంతులకు గురైనట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. వైష్ణవి చనిపోతూ తన చావుకు కారణం శోభ, సురేశ్ అని చెప్పి నోట్ రాసి చనిపోయింది. దీనిపై అమ్మాయి తండ్రి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు శోభ, సురేశ్​లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ గ్రామీణ ఎస్ఐ సందీప్ తెలిపారు.

సాలుర గ్రామానికి చెందిన టింకల్ రమేశ్ తన కూతురు వైష్ణవి(19) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. నిన్న సాయంత్రం 5గంటల సమయంలో తన ఇంటి వద్దగల కుళాయి వద్ద వైష్ణవి, భార్య లక్ష్మీకి సాలుర గ్రామానికి చెందిన శోభ అనే మహిళతో గొడవ అయ్యింది. శోభ గొడవ విషయంపై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పాప తండ్రికి ఫోన్ చేశారు. కేసు అయ్యిందేమో అని భయపడి మనస్థాపం చెందిన అమ్మాయి ఈరోజు ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో ఫ్యాన్​కు ఉరేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి తన చావుకు కారణం శోభ, సురేష్ అని నోట్ రాసి చనిపోయింది. ఈ విషయంపై అమ్మాయి తండ్రితో దరఖాస్తు తీసుకొని వారిపై కేసు నమోదు చేశాము- సందీప్, బోధన్ గ్రామీణ ఎస్ఐ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.