నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో భాజపా అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ గెలుపునకు కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు,అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు సభ నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ నాయకుడు రామ్ మాధవ్ దవే హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అది కేవలం భాజపాతోనే సాధ్యమని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతీ కార్యకర్త సైనికుల్లా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు..
ఇవీ చూడండి : తెతెదేపా కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు