కొవిడ్ రెండో దశ నేపథ్యంలో.. దేశంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరముందని ఐఎఫ్టీయూ నిజామాబాద్ నగర అధ్యక్షులు రవి పేర్కొన్నారు. కరోనా చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపత్కాలంలో బాధితులతో పాటు.. ప్రజలందరిని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర మందుల కొరతతో.. బాధితులు వాటిని బ్లాక్లో రూ. లక్షలు పెట్టి కొంటున్నారని రవి పేర్కొన్నారు. ఇదే అదనుగా భావించి ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడికి పాల్పడుతున్నాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్ని అన్ని రకాల సౌకర్యాలు, సిబ్బందితో బలోపేతం చేయాలన్నారు. మందులు, ప్రాణ వాయువును యుద్ద ప్రాతిపదికన అందుబాటులోకి తేవాలన్నారు.
కష్ట కాలంలో పేద కుటుంబాలకు నెలకు.. 50 కేజీల బియ్యం, రూ. 7 వేలను ఆర్థిక సాయంగా ప్రకటించాలని రవి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు భూమన్న, నగర నాయకులు మురళి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు