ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోలీ వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా అంతా సంబురాల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. హోరెత్తించే పాటలకు హుషారుగా నృత్యాలు చేశారు.
యువత, పిల్లలు ఎక్కువగా రంగుల పండుగలో పాల్గొన్నారు. కరోనా కారణంగా హోలీకి వృద్ధులు దూరంగా ఉన్నారు. కొవిడ్‌తో గతేడాది పూర్తిగా వేడుకలకు దూరంగా ఉన్న యువత.. ఈ ఏడాది ఉత్సాహంగా సంబురాలు చేసుకున్నారు.
ఇదీ చదవండి: చెట్టే కదా అని నరకలేదు.. ప్రత్యామ్నాయం ఆలోచించారు!