నిజామాబాద్ జిల్లాలో 1,762 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ లింక్ పంపి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
అన్ని వ్యాధులపై...
పోలీసు సిబ్బంది తప్పనిసరిగా తమ పూర్తి వివరాలు తెలియజేయాలి. బీపీ, షుగర్, ఆస్తమా, గుండె, కాలేయ, ఛాతి, కిడ్నీ, న్యూరో, మూత్ర తదితర అన్ని వ్యాధుల వివరాలు పొందుపర్చాలి.
వివరాలతోనే విధులు...
ఆరోగ్య వివరాల ఆధారంగానే విధులు కేటాయించనున్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కొవిడ్- 19 విధుల నుంచి మినహాయించే అవకాశం ఉంది. ఇలాంటి వారికి హెడ్‌క్వార్టర్లు, కంట్రోల్ రూంలు, ఠాణాల ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించనున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారికే కరోనా ప్రభావిత ప్రాంతాల్లో విధులు కేటాయించనున్నట్లు సమాచారం.