3 రోజుల ముందు గుర్తులా....?
నిజామాబాద్ లోక్సభ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని ధర్మాసనాన్ని కోరినట్లు రైతు అభ్యర్థుల తరఫు న్యాయవాది రచనారెడ్డి తెలిపారు. రాజకీయ నాయకులు 3 నెలల నుంచి ప్రచారం చేసుకుంటే... రైతు అభ్యర్థులకు 3 రోజుల ముందు గుర్తులు కేటాయించటం సమంజసం కాదని వాదనలు వినిపించామన్నారు. అన్నిఅంశాలను దృష్టిలోకి తీసుకుని రెండో విడతలో పోలింగ్ నిర్వహించాలని కోరినట్లు రచనారెడ్డి తెలిపారు.
రైతన్నల అభ్యర్థనలు విన్న ధర్మాసనం సోమవారం వెలువరించే తీర్పుపై భవిష్యత్ కార్యాచరణ ఉండనుందని రచనారెడ్డి వెల్లడించారు.