ETV Bharat / state

కుస్తీ పోటీల్లో ఔరా అనిపించిన దివ్యాంగుడు

ఎదైనా పని చెబితే చేయకుండా ఎన్నో కారణాలు చెబుతారు కొందరు. అది లేదు, ఇది లేదు అంటూ కుంటి సాకులు చెబుతుంటారు. చేయగలిగే వయసు ఉన్నా... ఆర్యోగంగా ఉన్నా.. ఉత్సాహం చూపించరు. నాకెందుకులే... నా వల్ల కాదంటూ డైలాగులు కొడతారు. కానీ నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఓ యువకుడు ఒక చేయి లేకున్నా కుస్తీ పోటీల్లో పాల్గొని ఔరా అనిపించాడు. సాధించాలన్న తపన ఉంటే వైకల్యం అడ్డుకాదని నిరూపించాడు.

handicaped participated in Wrestling
కుస్తీ పోటీల్లో ఔరా అనిపించిన దివ్యాంగుడు
author img

By

Published : Mar 9, 2020, 7:51 PM IST

Updated : Mar 10, 2020, 10:25 AM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లో హోలీ పండుగను పురస్కరించుకుని కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి మల్లయోధులు వచ్చారు. మహారాష్ట్రకు చెందిన గణేశ్​ అనే దివ్యాంగుడు యువకుడు పోటీల్లో పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచాడు.

ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. పోటీలను తిలకించడానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కుస్తీ పోటీల్లో ఔరా అనిపించిన దివ్యాంగుడు

ఇదీ చూడండి: సినిమాలో విలన్లు ఐఫోన్​ అందుకే వాడరట

Last Updated : Mar 10, 2020, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.