ETV Bharat / state

లాక్​డౌన్​లో చిక్కుకుపోయారు.. ఉపాధి పొందారు - ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా తాజా వార్తలు

నీటి జాడ లేక.. పంట పండక.. పని లేక.. పస్తులు ఉండే పరిస్థితులు ఆనాడు. జలకళ సంతరించుకున్న చెరువులు, జలాశయాలు.. పెరిగిన భూగర్భ జలాలు.. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు... చేతి నిండా పనులు ఈనాటి పరిస్థితి. ఇదీ గల్ఫ్ బాధితుల్లో చోటు చేసుకున్న ఓ గొప్ప మార్పు. కరోనా వేళ లాక్​డౌన్​లో చిక్కుకుపోయి ఉన్న ఊర్లోనే గల్ఫ్ బాధితులు ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు పనులు లేక గల్ఫ్ వెళ్లిన యువకులు.. ఇప్పుడు సొంతూర్లోనే వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ నుంచి వచ్చి లాక్​డౌన్​ వల్ల చిక్కుకుపోయి వ్యవసాయంతో ఉపాధి పొందుతున్న గల్ఫ్ కార్మికులపై ప్రత్యేక కథనం.

లాక్​డౌన్​లో చిక్కుకుపోయారు.. ఉపాధి పొందారు

author img

By

Published : Sep 4, 2020, 3:32 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అనగానే గల్ఫ్ బాధితులే మొదట గుర్తొస్తారు. ఏ గ్రామంలో చూసినా కనీసం ఒక్కరైనా గల్ఫ్ దేశాలకు ఉపాధికి వెళ్లిన వారు ఉంటారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి అధికంగా వెళ్తారు. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 2 లక్షల మంది వరకు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఓమన్, బహ్రెయిన్, దుబాయ్, ఇరాక్ వంటి గల్ఫ్ దేశాలతో పాటు మలేషియా, ఆఫ్ఘనిస్తాన్​కు ఈ రెండు జిల్లాల నుంచి ఉపాధి కోసం వెళ్లారు.

అయితే ఉపాధి కోసం వెళ్లినవారు ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి స్వదేశానికి వచ్చి నెలా, రెండు నెలలు ఉండి మళ్లీ వెళ్తారు. ఇలా సెలవుల మీద గల్ఫ్ దేశాల నుంచి వచ్చి ఇక్కడే అనేక మంది ఉండిపోవాల్సి వచ్చింది. విమానాలు లేకపోవడం, కరోనా విజృంభించడం వల్ల తిరిగి గల్ఫ్ దేశాలకు వెళ్లలేకపోయారు. అలాగే కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చింది. ఇందులో ఎక్కువ మంది ఉపాధి కోసం వెళ్లిన వారే ఉన్నారు. ఇలా సెలవులో వచ్చిన వారితోపాటు ప్రత్యేక విమానాల ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు దాదాపు 10 వేల మంది వచ్చారు. తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల సొంతూర్లోనే ఉండిపోయారు.

గల్ఫ్ బాట పట్టడానికి స్థానికంగా ఉపాధి లేకపోవడం, వ్యవసాయ అనుకూల పరిస్థితుల లేమి ప్రధాన కారణంగా మారాయి. అయితే గత మూడేళ్ల నుంచి తెలంగాణలో సరిపడా వర్షాలు కురవడం వల్ల వ్యవసాయ అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కరోనా కారణంగా గల్ఫ్​కు వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల వారంతా వ్యవసాయం బాట పట్టారు. గతంలో నీళ్లు లేక బీడుగా వదిలేసిన పొలాల్లోనే నేడు వ్యవసాయ పనులు చేసి పంటలు సాగు చేశారు. చెరువులు, జలాశయాలు పూర్తిగా నిండటం, భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో పుష్కలంగా నీళ్లు వస్తున్నందున గల్ఫ్​కు వెళ్లకుండా ఉన్న ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. అంతకుముందు భూమిని కౌలుకు ఇవ్వడం, లేదంటే కుటుంబ సభ్యులు, బంధువులు కొంతమేర ఆహారం కోసం సాగు చేసేవారు. అయితే ఇప్పుడు గల్ఫ్​కు వెళ్లొచ్చినవారు వ్యవసాయం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ అనుకూల పరిస్థితులు ఏర్పడటం సంతోషంగా ఉందని.. ఇలాంటి పరిస్థితే ఎప్పుడూ ఉంటే బాగుంటుందని గల్ఫ్​కు వెళ్లొచ్చినవారు అంటున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో అత్యధిక మంది గల్ఫ్ బాట పట్టినవారున్నారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా సొంతూర్లోనే ఉండాల్సి రావడం వల్ల సొంత భూమి ఉన్నవారు వ్యవసాయం చేసుకుంటున్నారు. భూమి లేని గల్ఫ్ కార్మికులు కౌలుకు తీసుకొని సాగు చేయడం, లేదా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తద్వారా సొంతూర్లోనే ఉపాధి పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, భీంగల్, ఆర్మూర్, మోర్తాడ్.. తదితర మండలాల్లో అనేక మంది వ్యవసాయం చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు.

వ్యవసాయ అనుకూల పరిస్థితులు ఉంటే.. గల్ఫ్​కు వెళ్లే పరిస్థితి ఉండదని గల్ఫ్ కార్మికులు అంటున్నారు. ఏళ్ల తరబడి గల్ఫ్ దేశాల్లో ఉండటం కంటే సొంత ఊర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం సంతోషం కలిగిస్తోందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీచూడండి: ఈఎస్​ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.