ETV Bharat / state

పాతికేళ్ల తెలుగు ప్రజల కలను సాకారం చేసిన సౌమ్య - గుగులోతు సౌమ్య వార్తలు

జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వారు.. ఆ దిశగా కలలు కంటుంటారు. వాటి సాకారానికి నిరంతరం సాధన చేస్తుంటారు. కానీ ఎలాంటి గమ్యం లేకుండానే మైదానంలోకి అడుగుపెట్టిన ఆ యువతి.. పాతికేళ్ల తెలుగు ప్రజల కలను సాకారం చేసింది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సౌమ్య.. రాష్ట్రం నుంచి జాతీయ ఫుట్‌బాల్‌ జట్టులో చోటు దక్కించుకుని సత్తా చాటింది.

guguloth soumya selected to national football team
పాతికేళ్ల తెలుగు ప్రజల కలను సాకారం చేసిన సౌమ్య
author img

By

Published : Feb 12, 2021, 10:08 PM IST

పాతికేళ్ల తెలుగు ప్రజల కలను సాకారం చేసిన సౌమ్య

నిజామాబాద్ జిల్లా రెంజల్‌ మండలం కూనేపల్లి కృష్ణతండాకు చెందిన గుగులోతు గోపి, ధనలక్ష్మి దంపతుల కూతురు సౌమ్య. ప్రస్తుతం ఆమె బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. ఏడో తరగతిలో ఉన్న సమయంలో పాఠశాల స్థాయిలో జరిగే పరుగు పోటీల్లో మెరుపు వేగంతో దూసుకువెళ్లిన సౌమ్యను చూసి... స్థానిక ఫుట్‌బాల్‌ కోచ్‌ నాగరాజు... ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. సౌమ్యను ఫుట్‌బాల్‌ శిక్షణకు పంపిస్తే గొప్ప క్రీడాకారిణి అవుతుందని చెప్పారు. ‘అమ్మాయిలకు ఆటలు ఎందుకంటూ మొదట వాళ్లు నిరాకరించినా.. కోచ్‌ నచ్చజెప్పటంతో ఎట్టకేలకు ఒప్పుకున్నారు.

అండర్‌-14 జాతీయ జట్టుకు ఎంపిక

2015లోనే అండర్‌-14 జాతీయ జట్టుకు సౌమ్య ఎంపికైంది. అప్పటి నుంచి సీనియర్‌ జట్టులో స్థానం కోసం సౌమ్య పట్టుదలతో ప్రయత్నించింది. చైనాలో జరిగిన అండర్‌-16 పోటీల్లో అత్యధిక గోల్స్‌తో టాపర్‌గా నిలిచింది. తెలంగాణ ఉమెన్స్‌ లీగ్‌లోనూ ఆమే టాపర్‌. గత ఏడాది జాతీయ స్థాయి ఉమెన్స్‌ లీగ్‌లో ముంబయి ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ క్యాంక్రి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. 2018లో బ్రిక్స్‌ దేశాల మధ్య జరిగిన జూనియర్స్‌ మహిళా ఫుట్‌బాల్‌ పోటీల్లోనూ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి తానేంటో నిరూపించుకుంది.

టర్కీలో జరిగే టోర్నమెంట్‌లో ఆడనున్న సౌమ్య

2022 ఖతార్‌లో జరిగే ఆసియా కప్‌ టోర్నీకి పటిష్ఠమైన మహిళా జట్టును పంపించాలని భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య కసరత్తు ప్రారంభించింది. గోవాలో రెండున్నర నెలల పాటు శిక్షణ శిబిరం నడిపింది. ఇందులో సౌమ్య స్ట్రైకర్‌గా చక్కటి ప్రతిభ కనబర్చటంతో తుది 20 మంది జట్టులో ఆమె స్థానం దక్కించుకుంది. ఈ జట్టు ఫిబ్రవరి 14 నుంచి టర్కీలో జరిగే టోర్నమెంట్‌లో ఆడనుంది. దేశ ఫుట్‌బాల్‌ జట్టులో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోగా... సౌమ్య ఆ ఘనత సాధించింది. జాతీయ సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకున్న తొలి తెలంగాణ క్రీడాకారిణిగా సౌమ్య అరుదైన రికార్డును సాధించింది. భవిష్యత్తులో జరగబోయే టోర్నమెంట్లలోనూ సౌమ్య రాణించాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి: కేసీఆర్ హామీలిస్తారు కానీ అమలు మాత్రం చేయరు: జానారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.