నిజామాబాద్ కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి టీఎస్ ఐపాస్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. టీఎస్ ఐపాస్ డీటెయిల్స్, టీప్రైడ్ పాలసీ కింద ఐదుగురు ఎస్సీలకు ట్రాక్టర్లు, గూడ్స్ లైట్ మోటార్ వెహికల్స్ మంజూరు చేశారు. టీ ప్రైడ్ పాలసీ కింద ఎస్టీలకు మంజూరయ్యాయి.
ట్రాక్టర్ అండ్ గూడ్స్ వెహికల్ మంజూరు అయిన వారికి సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ వారికి 35 శాతం, మహిళలకు 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ జనరల్ మేనేజర్ బాబురావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుదర్శన్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కరీంనగర్ జిల్లాలో 36 ధరణి కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు షురూ