డబుల్ బెడ్‌రూం ఇళ్లను తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా చేపట్టింది. కమిషనర్ జితేశ్ పటేల్‌కు వినతిపత్రం అందజేసింది.
నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలుకుతున్న ఎమ్మెల్యే.. కట్టిన ఇళ్లను కూడా పంపిణీ చేయలేని అసమర్థతకు కారణాలేంటో వివరించాలని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్ డిమాండ్ చేశారు. స్థలం ఉన్న వారికి రూ. 10లక్షల ఇంటి రుణాన్ని మంజూరు చేయాలన్నారు. కలెక్టరేట్ ప్రాంతంలోని ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రెండు పెళ్లిళ్లు చేసుకున్న భర్తకు భార్యల దేహశుద్ధి