ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వైద్య బోధన కళాశాలలో.. విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు.
నేటి నుంచి..
సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ.. తెలంగాణ మెడికల్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టినా పట్టించుకునే నాథుడే లేరని తెలిపిన ఆయన.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేటి నుంచి 8వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ఎదుట నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుధాకర్, భాగ్యలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.
'ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో పనిచేస్తున్న శానిటరీ, సెక్యురిటీ, పేషెంట్ కేర్ కార్మికుల సమస్యలును ప్రభుత్వమ వెంటనే పరిష్కరించాలి. జీవో 68 కాలపరిమితి 2017 మార్చి 18 నాటికి ముగిసి మూడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం కొత్త జీవో జారీచేయటం లేదు.
-ఓమయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి