ETV Bharat / state

ఫాస్ట్ ట్యాగ్ లేకుంటే టోల్ బాదుడు గ్యారెంటీ

జాతీయ రహదారిలో ఫాస్ట్​ ట్యాగ్​ లేకుండా రాకపోకలు సాగించే వారు అధిక రుసుము చెల్లించాల్సిందే. డిసెంబర్​ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ఈటీసీ విధానాన్ని అమలు చేసేలా కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు టోల్​ప్లాజా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. నగదు రూపంలో చెల్లించేవారి వద్ద అధిక రుసుము వసూలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఫాస్ట్ ట్యాగ్ లేకుంటే టోల్ బాదుడు గ్యారెంటీ
author img

By

Published : Nov 14, 2019, 11:10 PM IST

ఫాస్ట్ ట్యాగ్ లేకుంటే టోల్ బాదుడు గ్యారెంటీ

ఇకపై జాతీయ రహదారిలో ఫాస్ట్ ట్యాగ్ లేకుండా రాకపోకలు సాగించే వాహనదారుల జేబులకు చిల్లు పడనుంది. టోల్ ప్లాజాలో నగదు రూపంలో చెల్లించాల్సిన మొత్తం కన్నా రెట్టింపు వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్( ఈటీసి) విధానంలో టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికుల సమయం, ఇంధనం ఆదా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. డిసెంబరు ఒకటి నుంచి తప్పనిసరి చేయాలని టోల్ ప్లాజా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.

టోల్​ ప్లాజాల్లో పత్రాలు

ఇప్పటికే టోల్​ ప్లాజా యాజమాన్యాలు దీనిపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రం నుంచి వెళ్తున్న అన్ని జాతీయ రహదారులకు చెందిన మార్గాల్లో ఈ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో 17 మార్గాల్లో టోల్ ప్లాజాలున్నాయి. చెల్లించాల్సిన రుసుముకు సంబంధించి ప్రభుత్వం ఎలక్ట్రానిక్ స్టిక్కర్​ రూపొందించింది. దీన్ని పొందేందుకు జాతీయ బ్యాంకులతో పాటు టోల్ ప్లాజా కార్యాలయాల్లో సంబంధిత ప్రత్రాలు అందజేయాలి.

ప్రత్యేక యాప్​తో రీఛార్జ్​

జాతీయ రహదారుల సంస్థ అభివృద్ధి చేసిన ప్రత్యేక యాప్​లతో రీఛార్జ్ చేసుకోవాలి. టోల్ ప్లాజా యాజమాన్యం అందజేసిన స్టిక్కర్ వాహనం ముందు భాగంలో అద్దంపై అతికించాలి. యాప్​తో రీఛార్జ్ చేసుకుంటే వాహనం టోల్ ప్లాజా దాటే సమయంలో పైన అమర్చిన సీసీ కెమెరాలు వాహనంపై ఉన్న ట్యాగ్ స్కాన్ చేయడం వల్ల ఆటోమేటిక్​గా రుసుము టోల్ ప్లాజాకు వెళ్తుంది. ఇలా చేయడం వల్ల వాహనం నిలవాల్సిన అవసరం లేకుండా సమయం, ఇంధనం ఆదా అవుతుంది. డిసెంబర్ ఒకటి నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ లైన్లు ఫాస్ట్ ట్యాగ్​తో అనుసంధానించబడి ఉంటుందని, నగదు చెల్లించే ఒకట్రెండు వాహనాలు మాత్రమే ఉంటాయని సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఫాస్ట్ టాగ్ వాడని వినియోగదారులపై రెట్టింపు చార్జీలు వసూలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇవీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.