ETV Bharat / state

గ్రామాభివృద్ధి కమిటీలపై గంగపుత్ర చైతన్య సమితి ఆగ్రహం - gangaputhra

గ్రామాభివృద్ధి కమిటీలపై గంగపుత్ర చైతన్య సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ నిర్ణయించే ధరకే చేపల విక్రయాలు చేయాలని తమపై ఒత్తిడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Gangaputra Chaitanya Samithi outrage over village development committees
గ్రామాభివృద్ధి కమిటీలపై గంగపుత్ర చైతన్య సమితి ఆగ్రహం
author img

By

Published : Jun 25, 2020, 1:35 AM IST

Updated : Jun 25, 2020, 10:11 PM IST

గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు శ్రుతి మించుతున్నాయని గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అల్గొట్​ రమేష్​ గంగపుత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. కమిటీ నిర్ణయించే ధరకే చేపల విక్రయాలు చేయాలని తమపై పెత్తనం చలయించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

తల్వేద గ్రామంలో కిలో చేపలు కేవలం రూ.80 విక్రయిస్తున్నారని.. ఫలితంగా గిట్టిబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నామని సమితి ఆందోళన వ్యక్తం చేసింది. చేపల, చెరువులపై పూర్తి హక్కులున్న సంప్రదాయ మత్స్యకారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని సమితి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

మార్కెట్లో మాంసం అధిక ధరలకు అమ్ముతున్నారని.. చేపలు మాత్రం రూ.80కే విక్రయిస్తున్నామని సమితి సభ్యులు ఉట్నూర్ బాలయ్య గంగపుత్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నందిపేట్ మండల కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమితి సభ్యులు పల్లికొండ నర్సయ్య గంగపుత్ర తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఒకే ధరకు చేపల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని.. గంగపుత్రులంతా ఐక్యంగా ముందుకు సాగుతామన్నారు.

గ్రామాభివృద్ధి కమిటీలపై గంగపుత్ర చైతన్య సమితి ఆగ్రహం

ఇదీ చదవండి: అంగన్​వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్

Last Updated : Jun 25, 2020, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.