దేవుడు వరమిస్తాడని... వరుణుడు కరుణిస్తాడని.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం పిల్లరెడ్డి పల్లిలో ఈ రోజు ఘనంగా గంగమ్మ జాతర నిర్వహించారు. ఉదయమే నూతన వస్త్రాలంకరణతో అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకొని ఆట పాటలు నృత్యాలు చేసుకుంటూ ఆలయానికి ఊరేగింపుగా వెళ్లారు. ఊరేగింపులో శివ భక్తులు బోనాలు ఎత్తుకుని చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయానికి చేరుకొని గంగపుత్రులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వర్షాలు పడాలని యజ్ఞం, గంగమ్మ, శివుని కల్యాణం జరిపించారు. భక్తులకు అన్నదానం చేశారు.
ఇవీ చూడండి: అమ్మాయిల పేర్లు చెట్లపై చెక్కిన సైకో