ETV Bharat / state

శోభాయాత్రతో నిమజ్జనానికి తరలిన గణనాథుడు - వినాయక చవితి

పదకొండు రోజులు విశేష పూజలు అందుకున్న గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు. నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్ఠణంలో శ్రీ చక్రేశ్వర శివాలయంలోని గణేశునికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు.

ganesh immersion at bhodhan in nizamabad district
శోభాయాత్రతో నిమజ్జనానికి తరలిన గణనాథుడు
author img

By

Published : Sep 1, 2020, 12:54 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పదకొండు రోజులు భక్తుల పూజలందుకున్న గణనాథులను నిమజ్జనానికి తరలించారు. శ్రీ చక్రేశ్వర శివాలయంలోని సార్వజనిక్ వినాయకుడికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు.

శివాలయం నుంచి ప్రారంభమైన యాత్ర పోస్టాఫీసు, ఉద్మీర్ గల్లీ, బ్రాహ్మణ గల్లీ, అంబేడ్కర్​ చౌరస్తా, జూనియర్ కళాశాల మైదానంలోని వినాయక బావిలో నిమజ్జనం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. నిమజ్డన కార్యక్రమాన్ని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేసేవిధంగా ప్రజలు సహకరించాలని ఆర్డీవో రాజేశ్వర్​ కోరారు.

ఇవీ చూడండి: జల ప్రవేశానికి​ మహా గణపతి సిద్ధం.. శోభాయాత్ర ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.