నిజామాబాద్‌లో నిర్మించతలపెట్టిన కేంద్రీయ విద్యాలయానికి కేంద్ర మానవవరనరుల అభివృద్ధి శాక మంత్రి రమేశ్ పొక్రియల్ రిమోట్ ద్వారా శంకస్థాపన చేశారు. పట్టణంలో ఖిల్లా ప్రాంతంలో 10 ఎకరాల్లో రూ. 20 కోట్ల వ్యయంతో ఈ కేంద్రీయ విద్యాలయం నిర్మితమవుతోందని ఎంపీ అర్వింద్ వివరించారు. ఈ విద్యాసంస్థ నిజామాబాద్‌లో ఏర్పాటుకావడం జిల్లా వాసుల అదృష్టం అన్నారు. బోధన్ కేంద్రీయ విద్యాలయానికి కూడా పక్కా భవన నిర్మాణ ఏర్పాటు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. భవన నిర్మాణానికి పది ఎకరాల స్థలాన్ని సేకరించిన కలెక్టర్‌ను ఎంపీ అభినందించారు.
ఇవీ చూడండి: రాజకీయ అరంగేట్రంపై కంగనా ఆసక్తికర సమాధానం