ETV Bharat / state

ఎస్సారెస్పీ కాల్వకు ఆగిన నీటి విడుదల.. పెరిగిన చేపల వేట - fishes hunting in sri ram project canal

శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా నీటి విడుదల నిలిపివేయడంతో మత్స్యకారుల చేపల వేట జోరుగా సాగుతోంది. జాలరులు కాల్వలోకి దిగి చేపల వేట సాగిస్తున్నారు. టన్నుల కొద్దీ చేపలు వలలకు చిక్కడంతో మత్స్యకారులు పండుగ చేసుకుంటున్నారు. దీంతో వారికి ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.

fishes hunting in srsp canal nizamabad district
ఎస్సారెస్పీ కాల్వకు ఆగిన నీటి విడుదల.. పెరిగిన చేపల వేట
author img

By

Published : Oct 29, 2020, 7:22 PM IST

నిజామాబాద్‌ జిల్లా శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా నీటి విడుదల నిలిపివేయడంతో మత్స్యకారుల పంట పండుతోంది. కాల్వలో దిగి జోరుగా చేపల వేట సాగిస్తున్నారు. టన్నుల కొద్దీ చేపలు వలలకు చిక్కడంతో పట్టిన చేపలను వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు బాల్కొండ ఉమ్మడి మండలం నుంచి కోల్‌కతా, నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ తదితర పట్టణాల్లోని మార్కెట్లకి తరలిస్తున్నారు.

శ్రీరాం సాగర్‌ నుంచి వరద కాల్వకు గురువారం నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. దీంతో బాల్కొండ, ముప్కాల్‌, మెండోరా, వేల్పూర్‌, భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి, నందిపేట తదితర మండలాల నుంచి పెద్ద సంఖ్యలో మత్స్యకారులు అక్కడికి తరలి వచ్చారు.

పెద్ద ఎత్తున చేపలు పట్టుబడడంతో వాటిని స్థానిక మార్కెట్‌లో అమ్మే పరిస్థితి లేనందున వ్యాపారులకు కిలోకు రూ. వంద లోపే విక్రయించారు.

ఈ ఏడాది శ్రీరాంసాగర్‌ నిండినప్పటి నుంచి చేపల వేటతో మత్స్యకారులకు ఉపాధి లభించింది.

ఇదీ చదవండి: కేంద్ర బలగాలతో దుబ్బాక ఎన్నికలు నిర్వహించాలి: కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.