ETV Bharat / state

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చేపల్లో ఎదుగుదల లోపిస్తోంది! - మత్స్యకారుల ఆవేదన

మత్స్యరంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ చేపట్టింది. ప్రతి ఏటా మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రాజెక్టుల్లో, చెరువుల్లో, కుంటల్లో చేపపిల్లలు, రొయ్య పిల్లలను కలిపి వదులుతోంది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా... క్షేత్ర స్థాయిలో సమస్యలను అంచనా వెయ్యకపోవడంతో మత్స్యకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రొయ్య పిల్లలను అధిక సంఖ్యలో వదలడం వల్ల చేప పిల్లల్లో ఎదుగుదల లోపిస్తోందని మత్స్యకారులు వాపోతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో మత్స్యకారుల ఇబ్బందులపై కథనం...

fishers-problems-at-sriram-sagar-project
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేపల్లో లోపిస్తున్న ఎదుగుదల.. కారణం అదే
author img

By

Published : Sep 3, 2020, 2:11 PM IST

ఐదేళ్లుగా మత్స్యకారుల ఆర్ధికాభివృద్ధి కోసం రాష్ట్ర సర్కార్ సమగ్ర మత్స్యకార అభివృద్ధి పథకం కింద వంద శాతం రాయితీతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేప, రొయ్య పిల్లలను వదులుతోంది. ప్రభుత్వం లక్షల సంఖ్యలో చేప పిల్లలు వదులుతున్నా... గత మూడేళ్లుగా మత్స్యకారులకు మాత్రం లాభాలు దక్కడం లేదు.

నిజామాబాద్, నిర్మల్ రెండు జిల్లాల పరిధిలో దాదాపు 4వేల మంది మత్స్యకార కుటుంబాలు ప్రాజెక్టు మీద ఆధారపడి జీవిస్తున్నాయి. గతంలో ప్రభుత్వం రాయితీతో చేపలను ప్రాజెక్టులో వదిలేది. అప్పుడు కేవలం చేప పిల్లలు మాత్రమే వదలడంతో.. చేపల వేటకు ఎప్పుడు వెళ్లినా మత్స్యకారులకు సమృద్ధిగా చేపలు లభించేవి.

అయితే గత నాలుగేళ్లుగా ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం రొయ్యల సంఖ్య భారీగా పెంచి ప్రాజెక్టులో వదలడంతో చేప పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. ప్రభుత్వం రొయ్యల సంఖ్య తగ్గించి చేపల సంఖ్య పెంచాలని మత్స్యకారులు కోరుతున్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేపల్లో లోపిస్తున్న ఎదుగుదల.. కారణం అదే

గతంలో ప్రతి రోజూ ఎనిమిది నుంచి పది కిలోల చేపలు లభించేవని... ఇప్పుడు కిలో కూడా పడటం లేదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వారానికి ఐదు కిలోల వరకు చేపలు లభిస్తుండటంతో మత్స్యకారుల ఆదాయం పూర్తిగా పడిపోయింది.

కరోనా కూడా మత్స్యకారుల ఉపాధి మీద ప్రభావం చూపిస్తోంది. గతంలో మత్స్యకారులు గుత్తేదారుకు చేపలను విక్రయిస్తే.. గుత్తేదారులు మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేసేవారు.

అయితే కరోనా కారణంగా విక్రయాలు పూర్తిగా పడిపోవడంతో డిమాండ్ లేకుండా పోయింది. చేపలు, రొయ్యల విక్రయాలు మందగించడంతో ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఇబ్బందులను గమనించి రొయ్యల సంఖ్య తగ్గించి.. చేప పిల్లల సంఖ్య పెంచాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: కొబ్బరితో కొత్త జీవితం.. ఆ కళకే డాక్టరేట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.