నిజామాబాద్ నగరంలోని ఓ షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని రాష్ట్రపతి రోడ్డులోని లక్ష్మీ వెంకటరమణ షాపింగ్ బయట వైపు విద్యుత్ దీపాలంకరణ దీపాల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపింగ్‌మాల్ పైభాగంలో ఒకేసారి మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. భవనం విద్యుత్ అలంకరణ దీపాల నుంచి షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు షాపింగ్‌మాల్ యాజమాన్యం తెలిపింది.
ఇవీ చూడండి: ఆదరణ కరువై వృద్ధుడి ఆకలి చావు