Father killed his daughter at Nizamabad on Extramarital affairs : అమ్మ అంటే అప్యాయత నాన్న అంటే నమ్మకం ఆ ఇరువురు కలిసి ఉంటేనే పిల్లల ఆలనపాలన.. వారి బాధ్యతను వారు మరచి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు బతికితే కొన్ని కుటుంబాల్లో తప్పవు విషాదాలు. భార్యపై కోపంతో పిల్లలను దూరంగా పెట్టడం.. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆ కోపం పిల్లలపై చూపితే ఇక్కడ నష్టపోయింది ఎవరు..? భర్త లేదా భార్య..! లేదా ఏ పాపం తెలియని పసి హృదయాలా..! నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘటనలో మాత్రం ఏ పాపం తెలియని పసి హృదయం ఆగ్నికి ఆహుతైంది. ఇక్కడ నిందితుడు ఎవరో కాదు చిన్నప్పటి నుంచి కంటికి రెప్పల కనిపెంచిన తండ్రే కావడం మరింత కలచి వేస్తోంది.
ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్‌రావు తెలిపిన వివరాలు ప్రకారం.. నిర్మల్ జిల్లా ధనికి గ్రామానికి చెందిన పోశాని, కామారెడ్డికి చెందిన కాశీరాం భార్యభర్తలు. గ్రామాల్లో ప్లాస్టిక్ కాగితాలు, ఇనుప వస్తువులు అమ్ముకుని వీరు జీవనం సాగించే వారు. వీరికి తొమ్మిది, పదేళ్ల వయస్సు గల సమ్మక్క, సారక్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గత కొంత కాలంగా తరచూ గొడవలు జరిగేవి. దీంతో కొద్ది రోజులు క్రితం నుంచి ఇరువురు ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు.
- కూతుర్ని చంపి.. సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన తండ్రి.. అసలేం జరిగింది?
- మరో పరువు హత్య.. 'నాన్నా.. నన్ను చంపొద్దు ప్లీజ్'.. ఆడియో వైరల్
ప్రస్తుతం భార్య పోశాని వద్ద ఇద్దరు కుమార్తెలు ఉంటుండగా.. ఆమె మరో వ్యక్తితో కలిసి ఉంటుంది. కాశీరాం మాత్రం ఒక్కడే కాగితాలు, పాత ఇనుప సామన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో కాశీరాం భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 11వ తేదీన పోశాని తన ఇద్దరి కూతుళ్లతో కలిసి ప్రశాంత్ అనే మరో వ్యక్తితో కలిసి ఉండటం కాశీరాం గమనించాడు. అప్పటికే తీవ్ర ఆవేశంతో ఉన్న ఆయన భార్యపై కోపంతో తన కుమార్తె సారక్క(9)ను పక్కనే ఉన్న మంటల్లో తోసేశాడు.
దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి బాలికను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆదిలాబాద్, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 80శాతంపైగా శరీరం కాలిపోవడంతో బాలిక చికిత్స పొందుతూ మరణించింది. పోశాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాశీరాంను ఇవాళ పోచంపాడ్ కూడలి వద్ద పట్టుకున్నారు. కేసును దర్యాప్తు చేసిన సీఐ గోవర్ధన్‌రెడ్డి, మెండోరా ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు సిబ్బందిని ఏసీపీ ప్రభాకర్‌రావు అభినందించారు.
ఇవీ చదవండి: