నిజమాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 5 గంటలకే వెళ్ళి వరుసలో నిలబడి పడిగాపులు పడుతున్నారు. భీంగల్‌లో యూరియా కోసం రైతులు ఉదయాన్నే వచ్చినప్పటికీ... అధికారులు మాత్రం తీవ్ర జాప్యం చేశారు. అవసరమైన మేర ఎరువులు అందజేయలేకపొయారు. ఒక్కొక్కరికి ఒక్కో బస్తా చొప్పున ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రైతులు ఆందోళన వ్యక్తం చేయటం వల్ల... మళ్ళీ వచ్చినపుడు ఇస్తామని రైతులకు అధికారులు నచ్చజెప్పారు. ఉదయం నుంచి పడిగాపులు పడినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయిందని కర్షకులు వాపోయారు.
ఇవీ చూడండి: 'సాహో' దర్శకుడి భావోద్వేగం.. ప్రభాస్‌పై కామెంట్