ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టరేట్​ ఎదుట రైతుల ధర్నా - ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టరేట్​ ఎదుట రైతుల ధర్నా

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్​ చేస్తూ నిజామాబాద్​ కలెక్టరేట్​ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఓ వైపు అకాల వర్షాలకు ధాన్యం తడిసి పాడైపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

farmers protests for paddy grain purchasing in nizamabad
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతుల ధర్నా
author img

By

Published : May 8, 2021, 5:05 PM IST

నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​ ఎదుట మాక్లూర్ మండలం ఓడ్యాపల్లి గ్రామ రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్​ చేశారు. కేంద్రం ప్రారంభించి నెలలు గడుస్తున్నా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపించారు.

ఇప్పటి వరకు కాంటా వేసిన 8,500 ధాన్యం సంచులు వర్షానికి తడుస్తూ చెదలు పడుతున్నాయని రైతులు అన్నారు. అయినా సొసైటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రెండో డోసు కోసం వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద జనం పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.