ETV Bharat / state

Armoor Municipality: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించవద్దని ఆందోళన - ఆర్మూర్​ మున్సిపాలిటీ తాజా వార్తలు

Armoor Municipality: ఆర్మూర్​ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించవద్దని రైతులు ఆందోళనకు దిగారు. అక్కడ మార్కెట్​ నిర్మిస్తే తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.

Farmers worry not to build an integrated market
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించవద్దని రైతులు ఆందోళన
author img

By

Published : Mar 10, 2022, 3:51 PM IST

Updated : Mar 10, 2022, 4:26 PM IST

Armoor Municipality: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో రూ.4.50 కోట్లతో నిర్మించునున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద అన్నదాతలు ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితమే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మార్కెట్​ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.

అంగడిబజార్​లోని శిలాఫలకం ఎదుట టెంట్ వేసుకొని పార్టీలకు అతీతంగా బైఠాయించారు. ఆ స్థలంలో వారం సంత నిర్వహిస్తున్నామని ఇప్పుడు మార్కెట్ నిర్మిస్తే తాము నష్టపోతామని వాపోయారు. పలువురు రైతులు శిలాఫలకం ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు.

ఇదీ చదవండి: 'పురుగు పట్టొద్దు.. పోషకాలు తగ్గొద్దు..' పప్పుధాన్యాలపై పరిశోధనలు

Last Updated : Mar 10, 2022, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.