నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చారు.
వామపక్ష పార్టీలు, తెదేపా నేతలు ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. సన్న ధాన్యాలకు రూ.2500 మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పసుపు పంటకు సైతం రూ.15వేలు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. మొక్కజొన్న పంటను ముందే అమ్మేసిన రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.