ETV Bharat / state

'బజారుకు ఈడుస్తాం.. అంతు చూస్తాం' - నిజామాబాద్‌ తాజా వార్తలు

ఆరు ఎకరాల స్థలాన్ని తన పేరున నమోదు చేయాలని, లేకపోతే అంతు చూస్తామని తహసీల్దార్‌ను ఓ మాజీ మావోయిస్టు బెదిరించాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా రామారెడ్డి రెవెన్యూ కార్యాలయంలో చోటుచేసుకుంది.

farmer-threats-on-tahsildar-of-ramareddy-nizamabad
'బజారుకు ఈడుస్తాం.. అంతు చూస్తాం'
author img

By

Published : Jun 24, 2020, 11:45 PM IST

'బజారుకు ఈడుస్తాం.. అంతు చూస్తాం'

నిజామాబాద్‌ జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు పెద్దోళ్ల నర్సారెడ్డి, అతని తమ్ముడు పెద్దోళ్ల సంతోశ్‌ ఇద్దరు కలిసి భూమి విషయంమై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గిద్ధ గ్రామ శివారులోని సర్వే నంబరు 228లోని ఆరు ఎకరాల స్థలానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని ఆ భూమిని తమ పేరున రిజిస్టర్​ చేయాలన్నారు. ఆ స్థలాన్నిపెద్దోళ్ల నర్సా రెడ్డి పూర్వీకులు గతంలో విక్రయించారని తహశీల్దార్ తెలిపారు.

తమ పేరున నమోదుచేయకపోతే.. బజారుకు ఈడుస్తామని.. అంతు చూస్తామని బెదిరించినట్లు రామారెడ్డి తహసీల్దార్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో వాళ్లిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామారెడ్డి పట్టణ ఎస్సై రాజు తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా టెస్టుల్లో కొత్త రికార్డ్- ఒక్కరోజే 2 లక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.