నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం కొట్టాలపల్లిలో విద్యుదాఘాతంతో రైతు బలరాం మృతిచెందాడు. రబీ కోసం నారుమడి సిద్ధం చేసిన బలరాం.. తరచూ అడవి పందులు పంటను ధ్వంసం చేస్తున్నాయని విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేశాడు.
నారుమడికి నీరు పారించేందుకు బలరాం ఈరోజు పొలానికి వెళ్లాడు. చూసుకోకుండా తాను అమర్చిన విద్యుత్ తీగలు తగలి.. అక్కడికక్కడే మృత్యవాత పడ్డాడు.
- ఇదీ చూడండి : గ్రీన్ఇండియా కోసం కృషి చేద్దాం: షాయాజీ షిండే