నిజామాబాద్ నగరంలోని ట్రెండీ క్రియేషన్స్‌లో ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి సందర్భంగా సుమాంజలి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ పాల్గొని సురవరం రచనలను గుర్తు చేసుకున్నారు.
ఆయన సారథ్యంలో వచ్చిన గోలకొండ కవుల సంచిక తెలంగాణలో... కవులు, సాహిత్యము లేదన్న మాటలకు సమాధానంగా నిలిచిందని పేర్కొన్నారు. సురవరం రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర తెలుగు సాహిత్యంలోనే మకుటాయమానమైన రచన అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేవీ రమణాచారి, లక్ష్మీ నరసయ్య చారి, తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: 'ఆరు నెలల్లో 175 వాయు నాణ్యత కేంద్రాలు!'