కార్తిక మాసం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీల కంఠేశ్వరాలయంలో మాజీ ఎంపీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే ఆలయానికి చేరుకున్న కవిత కార్తిక దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. సుమారు గంట పాటు మహా శివునికి అభిషేకం చేశారు. తులసి, ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ