ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేయించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శివశంకర్ సూచించారు. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత కొవిడ్ వచ్చి.. కోలుకున్నాక కూడా టీకా తీసుకోవచ్చని తెలిపారు. వ్యాక్సిన్‌పై అపోహలు, ఇబ్బందులు, వదంతులపై ఈటీవీ భారత్ చేపట్టిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో పలువురి సందేహాలకు ఆయన సమాధానాలిచ్చారు.
పాజిటివ్ వచ్చిన రోజు నుంచి కొవాగ్జిన్ అయితే 28 రోజులు, కొవిషీల్డ్ అయితే 42 రోజుల తర్వాతనే టీకా తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా దీర్ఘకాలిక రోగాలకు వాడుతున్న మందులన్నీ వేసుకోవచ్చని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదని వివరించారు. అయితే 48గంటల లోపు మద్యం తీసుకుంటే వ్యాక్సిన్ పని చేయదని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వంద మందికి పైగా ప్రశ్నలు అడిగి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు.