నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇంజినీర్స్ డేను కొవిడ్ నిబంధనల నడుమ నిరాడంబరంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజినీర్స్ డే నిర్వహించారు.
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మోక్షగుండం జయంతి సెప్టెంబర్ 15ను ఇంజినీర్స్ డేగా జరుపుకుంటారు.
పాలిటెక్నిక్ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మోక్షగుండం జయంతి ఇంజినీర్స్ డేను నిర్వహించగా.. యువ ఇంజినీర్లు మోక్షగుండంను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాంకుమార్ అన్నారు.
- ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతాలు ఆపాలని కోరిన తెలంగాణ సర్కారు