శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలు. ప్రస్తుతం 16.208 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1062.20 అడుగులుగా ఉంది. ఈ నెల 3 వరకు ప్రాజెక్టులో 5.933 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అదే రోజున 30 వేల క్యూసెక్కుల ప్రవాహం ఎగువ నుంచి రావడం ప్రారంభమైంది. ఆగస్టు 9, 10 తేదీల్లో ఎగువ నుంచి ప్రవాహం పెరిగింది. ఇదే నెల 11న నీటి నిల్వ 15.6 టీఎంసీలకు చేరగా.. వరద తగ్గిపోయి 5 వేల క్యూసెక్కులకు పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవహిస్తుండగా.. శ్రీరాంసాగర్‌కు మాత్రం 44 వేల క్యూసెక్కులు దాటలేదు. ఇటీవల పడిన వర్షాల వల్ల కేవలం 10 టీఎంసీల నీరు మాత్రమే చేరింది.
ఇక మంజీరా నదిపై ఉన్న కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి నీరు రావడం రోజురోజుకీ గగనమవుతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినా.. నిజాం సాగర్‌కు మాత్రం చుక్క నీరు రాలేదు. నిజాం సాగర్‌కు సమీపంలో ఉన్న చిన్న ప్రాజెక్టులు నిండినా లాభం లేకుండా ఉంది. వర్షాలు పడకముందు ఎంత నీరుందో.. ఇప్పుడూ అంతే ఉంది. నిజాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.137 టీఎంసీలు డెడ్ స్టోరేజీతో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1368 అడుగులు ఉంది. ఈనెల 3 నుంచి ఇప్పటి వరకు వరద ప్రవాహం లేదు. ఎగువన మెదక్ జిల్లాలోని సింగూర్ జలాశయం నిండితే తప్ప నిజాంసాగర్‌కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ప్రాజెక్టు కింద గత రెండేళ్ల వరకు 2.35లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రాజెక్టులోకి నీళ్లు రాక దాన్ని 1.70 లక్షల ఎకరాలకు కుదించారు.
ఇవీ చూడండి : సాగర్‌కు పెరిగిన వరద ఉద్ధృ