Election Arrangements in Nizamabad District : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 5, కామారెడ్డి జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ ఎన్నికల అధికారి పరిధిలో.. నిజామాబాద్, నిజామాబాద్ గ్రామీణం, బోధన్, ఆర్మూర్, బాల్కొండ.. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం ఉంది.
Polling Centers in Nizamabad District : ఎన్నికల కోసం నిజామాబాద్ జిల్లా పరిధిలో 1549 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఆరు నియోజకవర్గాల్లో 13,65,811 మంది ఓటర్లుండగా.. పురుషులు 6,47,149.. మహిళలు 7,18,603.. ఇతరులు 59 మంది ఓటర్లు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మొత్తం 2,6,344 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 96,404 మంది.. మహిళలు 1,9,933 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. వారు ఓటు వేసేందుకు.. 217 పొలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆర్మూర్‌లో 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అమూల్యమైన ఓటు వేసేముందు ఎన్నో సందేహాలు - ఇదిగో వాటికి సమాధానాలు
బోధన్ నియోజకవర్గంలో మొత్తం 2,15,963 మంది ఓటర్లుఉండగా.. పురుషులు 1,3,577.. మహిళలు 1,12,381 మంది.. ఇతరులు ఐదుగురు ఉన్నారు. నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం.. 246 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాన్సువాడలో మొత్తం 1,92,841 మంది ఓటర్లు ఉండగా.. 92,225 పురుషులు.. మహిళలు 1,00,608, ఇతరులు 8 మంది ఉన్నారు. ఓటింగ్ కోసం.. 258 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Nizamabad Assembly Election Polling 2023 : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 2,86,766 మంది ఓటర్లు(Voters) ఉండగా.. 1,39,163 పురుషులు, 1,47,571 మంది మహిళలు.. ఇతరులు 32 మంది ఉన్నారు. ఇక్కడ ఓటింగ్ కోసం.. 289 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో.. మొత్తం 2,48,269 మంది ఓటర్లుంటే అందులో 1,16,52 పురుషులు.. మహిళలు 1,32,212 ,ఇతరులు ఐదుగురున్నారు. ఓటింగ్ కోసం.. 293 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.
నిఘా నీడలో తెలంగాణ - శాసనసభ పోలింగ్‌కు పకడ్బందీ గస్తీ
బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం 2,15,628 మంది ఓటర్లు ఉంటే అందులో 99,728 పురుషులు.. మహిళలు 1,15,898 మంది, ఇద్దరు ఇతరులు ఉన్నారు. ఓటింగ్ కోసం 246 పోలింగ్ కేంద్రాలను(Polling Centers) ఏర్పాటు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 6,61,163 ఓటుర్లు ఉంటే.. అందులో పురుషులు 3,21,104.. 3,40,22 మంది మహిళలు.. ఇతరులు 37 మంది ఉన్నారు. జిల్లాలో.. 556 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జుక్కల్‌లో.. మొత్తం 1,97,897 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 97,618.. 1,00,269 మంది మహిళలు, ఇతరులు 10 మంది ఉన్నారు. వారికోసం 138 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 2,17,444 మంది ఓటర్లు ఉంటే 1,4,768 పురుషులు.. 1,12,673 మంది మహిళలు, ఇతరులు ముగ్గురున్నారు. వారి కోసం 258 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో(Kamareddy Constituency) మొత్తం 2,45,822 మంది ఓటర్లు ఉంటే అందులో 1,18,718 పురుషులు.. 1,27,80 మంది మహిళలు, ఇతరులు 24 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి కోసం 160 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.