సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో 2కే రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహనరావు ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ అర్వింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్, భారత్ మాతాకీ జై వంటి నినాదాలు చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పరుగులో పాల్గొన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సాగిన 2కే రన్ కలెక్టరేట్ నుంచి వర్ని చౌరస్తా వరకు కొనసాగింది.
ఇవీచూడండి: సకల జనుల భేరికి పోటెత్తిన మద్దతు