నిజామాబాద్లో ఆటో ఎక్స్పో నిజామాబాద్లో ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్పో వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. నగరంలోని కలెక్టరేట్ మైదానంలో శని, ఆదివారాల్లో ఆటోషో ఏర్పాటు చేశారు. వివిధ కంపెనీలకు చెందిన కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు ప్రదర్శనలో పెట్టారు. ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ప్రదర్శనలో భాగమయ్యాయి. వాహన రుణం అందించేందుకు బ్యాంకు సిబ్బంది అందుబాటులో ఉన్నారు.